మంత్రాచరణ
మంత్రాచరణ నాకు తెలిసి మంత్రాలు రెండు వర్గాలు. బీజాక్షర మంత్రాలు, బీజసహిత మంత్రాలు - ఇవి దేవతలను స్తుతించేందుకు. ఎక్కవ నామ మంత్రాలు - అష్టోత్తరశత నామ, సహస్రనామ మంత్రాలు, సూక్తాలు. ఒక దేవతకు సంబంధించిన బీజాక్షరమంత్రము దేవత యొక్క సూక్ష్మ రూపం. {మనిషికి కూడా స్థూల శరీరము, సూక్ష్మశరీరము, కారణ శరీరము ఉంటాయని మన శాస్త్రాలు చెపుతాయి. అందరికీ స్థూలశరీరము తెలుసు - మనం చూడగలము, నేరుగా పోషిస్తాము కనుక, సూక్ష్మ శరీరము చూడకపోయినా (బుద్ధి, మనస్సు, చిత్తము, అహం అనే అంత:కరణాలుగా) అనుభవంలో తెలుసు. కానీ కారణ శరీరము మన అనుభవంలోక్ రాదు, ఇది కర్మ సిద్ధాంతము ప్రతిపాదించినది, కర్మని -పుణ్యమూ, పాపమూ- అనుభవించటానకి జన్మాంతరాల మధ్యకూడ ప్రయాణిస్తుంది. స్థూల, సూక్ష్మ శరీరాలతో ఉంటుంది, అవి నశించిన తరువాత ఉంటుంది} మనిషి శరీరాన్ని ఆహారమూ, వ్యాయామములు వగైరాలతో చక్కగా పోషించుకుంటాడు (కొంతమంది మరీ ఎక్కువ పోషించేసి స్థూలకాయం తెచ్చుకుంటారు). కానీ సూక్ష్మశరీర పోషణ విషయములో సరైన అవగాహన లేక సంప్రదాయిక ఆచారాలతోనూ, సంఘ మర్యాదలను పాటించుతూ సరిపుచ్చుకుంటాడు. కానీ వాటితో సూక్ష్మ శరీర పోషణ జరుగుతుంటుంది కానీ పరిప...