అన్నమయ్య కీర్తన - ఏ పురాణమున ఎంత వెదికినా
అన్నమయ్య కీర్తన " ఏ పురాణమున ఎంత వెదికినా.... " లో సున్నితంగా చెప్పినా లౌకిక జీవితానికి అన్వయించే మార్గాలు సూచించారు. ఈ మార్గాన వెళితే మనిషి కి శాంతి తథ్యం. వివరణకు ముందు కీర్తన, తరువాత జేసుదాసు గారి గానం ఇస్తున్నాను. ప || ఏ పురాణముల ఎంత వెదికినా | శ్రీపతి దాసులు చెడరెన్నడును || చ || హరి విరహితములు అవికొన్నాళ్ళకు | విరసంబులు మరి విఫలములు | నరహరి గొలిచిటు నమ్మిన రవములు | నిరతము లెన్నడు నెలవులు చెడవు || చ || కమలాక్షుని మతిగానని చదువులు | కుమతంబులు బహు కుపథములు | జమళి అచ్యుతుని సమారాధనలు | విమలములేకాని వితథముకావు || చ || శ్రీవల్లభుగతి జేరనిపదవులు | దావతులు కపట ధర్మములు | శ్రీవేంకటపతి సేవించు సేవలు | పావనము లధిక భాగ్యపు సిరులు || జేసుదాసు గారి గానం : https://www.youtube.com/watch?v=h4_kHpIYKWU&list=RDh4_kHpIYKWU వివరణ అన్నమయ్య రచనలు బహు సరళంగా అందరికీ అర్ధమయేలాగానే ఉంటాయి. నేను ఆయన వెలిబుచ్చిన ఆలోచనలను, కేవలం వివరిస్తున్నాను. ఈ పాట అప్పటికన్నా(అన్నమయ్య 15వ శతాబ్దం వాడు), ఇప్పుడే ఎక్కువ అవసరం. శాంతి, ఆనందములే ముఖ్యమని ప్రతి మనిషికీ...