కుండలినీ యోగ - భౌతిక శాస్త్రం
భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రములో అలౌకికమైన భగవదారాధనతో పాటు ఆధునిక శాస్త్రములోని అంశములవలే కొన్ని పోలికలున్నాయి, అందులో ఒకటి కుండలినీ యోగము. కుండలినీ యోగ శాస్త్రము ప్రకారము 5 పంచభూతములు 5 కేంద్రాలలో మనిషి వెన్నెముకనంటి ఉంటాయి. అవి వరుసగా పృధ్వి గ్రంధి (మూలాధారములో - మనిషి పీఠములో), జలగ్రంధి (స్వాధిష్టానములో-నాభిక్రింద), అగ్ని గ్రంధి (మణిపురములో - నాభిస్థానములో), వాయు గ్రంధి (అనాహతములో - ఛాతి స్థానములో), ఆకాశగ్రంధి (విశుద్ధ స్థానములో - కంఠ స్థానంలో) ఉంటాయి. అంటే అవి వరుసగా ఆకాశగ్రంధి (విశుద్ధ స్థానములో - కంఠ స్థానంలో) ^ వాయు గ్రంధి (అనాహతములో - ఛాతి స్థానములో) । ...