కుండలినీ యోగ - భౌతిక శాస్త్రం
భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రములో అలౌకికమైన భగవదారాధనతో పాటు ఆధునిక శాస్త్రములోని అంశములవలే కొన్ని పోలికలున్నాయి, అందులో ఒకటి కుండలినీ యోగము.
కుండలినీ యోగ శాస్త్రము ప్రకారము 5 పంచభూతములు 5 కేంద్రాలలో మనిషి వెన్నెముకనంటి ఉంటాయి. అవి వరుసగా పృధ్వి గ్రంధి (మూలాధారములో - మనిషి పీఠములో), జలగ్రంధి (స్వాధిష్టానములో-నాభిక్రింద), అగ్ని గ్రంధి (మణిపురములో - నాభిస్థానములో), వాయు గ్రంధి (అనాహతములో - ఛాతి స్థానములో), ఆకాశగ్రంధి (విశుద్ధ స్థానములో - కంఠ స్థానంలో) ఉంటాయి. అంటే అవి వరుసగా
ఆకాశగ్రంధి (విశుద్ధ స్థానములో - కంఠ స్థానంలో)
^
వాయు గ్రంధి (అనాహతములో - ఛాతి స్థానములో) ।
^
అగ్ని గ్రంధి (మణిపురములో - నాభిస్థానములో). ।
^
జలగ్రంధి (స్వాధిష్టానము లో - నాభిక్రింద). ।
^
పృధ్వి గ్రంధి (మూలాధారములో-పీఠములో). ।
ఈ 5 గ్రంధుల స్థానాల క్రమము పరిశీలించితే మనిషి వెన్నెముక పైకివెళ్తున్న కొలదీ గ్రంధుల వ్యాపకశక్తి పెరిగి సాంద్రత తగ్గుతున్నట్లు తెలుస్తుంది.
ఈ రెండు శాస్త్రాలమధ్య పోలిన అంశాలు:
1. పదార్ధశాస్త్రము ప్రకారము ఒక పదార్ధము యొక్క భౌతిక స్థితిలోని ధర్మాలు - పదార్ధము ఘన, ద్రవ, వాయు స్థితులకు మారుతున్నప్పుడు ఆ పదార్ధము యొక్క అ) వ్యాపకగుణము పెరుగుతుంది, ఆ) సాంద్రత - గ్రాము/ఏకాంశ పరిమాణం (గ్రాము/క్యూ,సెం.మీ) తగ్గుతుంది, ఆ పదార్ధము సూక్ష్మతరమవుతుంది. అదే గుణము కుండలినీ శాస్త్రము ప్రతిపాదిస్తున్నది
2. కుండలినిలోని 6 వ గ్రంధి ‘సహస్రారము’ మనిషి నుదుటి స్థానములో ఉంటుందని కుండలినీ శాస్త్ర ప్రతిపాదన. గ్రంధి క్రమాన్ని అనుసరించి చూస్తే ఈ గ్రంధి అన్నిటికన్నా అత్వంత వ్యాపకశక్తి కలదై, సూక్ష్మతమమైనది. ఆకాశము - అంటే రోదసి - విశ్వమంతా వ్యాపించినదని ఆధునిక శాస్త్రమూ చెపుతోంది. సహస్రారము (ఆత్మ) ఆకాశము కన్నా సూక్ష్మమై, మించి వ్యాపించి ఉండాలి, అంటే విశ్వాన్ని మించిన వ్యాపకమై ఉండాలి. పరమాత్మ గురించి చెపుతూ ‘పాదోస్య విశ్వా భూతాని’ అంటూ పరమాత్మలో ఎంత భాగము విశ్వములో ఉందో పురుషసూక్తము ఉద్ఘాటిస్తుంది. ఇక్కడ పాదము అంటే నాలుగవ వంతు అని కాక అత్యల్పము అని మన శాస్త్రాలు చెప్పాయి. పరమాత్మ విశ్వాన్ని మించి వ్యాపించి ఉన్నాడు. అంటే పరమాత్మ అనంత విశ్వాలను గానీ ( సమాంతర విశ్వాలను - పేరలెల్ యూనివర్సెస్), ఈ విశ్వంలోని కానరాని దృక్పధాలను (డైమెన్షనులు) గానీ లేక ఆ రెంటినీ తానై ఉన్నాడేమో. ఈ విషయంలో ఆధునిక శాస్త్రమూ అసందిగ్ధముగానే ఉన్నదన్న సంగతి అందరికీ తెలుసు.
భౌతిక శాస్త్రము పై రెండు అంశాలను ప్రతిపాదించి నిరూపణ కూడా చేసింది. కుండలిని యోగములో ఆ రెండు అంశాలూ గ్రంధుల వరుస క్రమాన్ని (క్రిందనుండి పైకి) అనుసరించి భౌతికశాస్త్ర ప్రతిపాదనకు పోలినట్లు స్వీకరించవచ్చును, కానీ విషయనిరూపణ కావాలి.
విషయనిరూపణ:
1. ఏమని నిరూపించాలి? కొలమానం
2. ఎలా నిరూపించాలి? పద్ధతి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి