శాక్తేయం-అర్చన
అమ్మ(వారే) పరబ్రహ్మమని నమ్మేవారి మతం - శ్రీవిద్య, శ్రీచక్రవిద్య, షట్చక్రవిద్య - శాక్తేయంలో బ్రహ్మవిద్యలు. ప్రతి మనిషి వెన్నెముక ద్వారా శక్తి (అమ్మ) పైకి ప్రవహించి నెత్తి నడి మధ్యన (సహస్రారంలో) అయ్య(పరబ్రహ్మాన్ని) కలుస్తుంది ఏ కోటిలో ఒకరికి. కానీ అందరిలో భగవంతుడుని విష్ణువైనా, శివుడైనా, బ్రహ్మైనా, గణపతైనా, లక్ష్మైనా,....) నమ్మే వారికి ఆ శక్తి కొద్దోగొప్పో పైకి ప్రవహించటము మొదలవుతుంది. అది (ఆ ప్రవాహం) నిలబడటానికి మన పూర్వీకులు ‘పంచోపచార’ అర్చన బోధించారు-ఇంటా,కోవెలలో(బయటా). షట్కచక్రాలలో 5 పంచభూతాలే, మనం లోపలా, బయట చూడగలిగేవి. పంచ భూతం - చక్రం పేరు-మనిషిలో ఆకాశం. -విశుద్ధం. - కంఠం వాయువు. - అనాహతం. -ఛాతిమధ్య అగ్ని. - మణిపురం. - నాభి జలం(నీరు). స్వాధిష్టానం - నాభి/పీఠం భూమి(పదార్ధం). -మూలాధారం-పీఠం అందుకుని అర్చనల్లో విధిగా పంచభూత సంబంధమైన విధులు కూర్చారు. మంత్రము (శబ్దం - ఆకాశము) గంథం (వాయువు) హారతి (అగ్ని)...