శాక్తేయం-అర్చన

అమ్మ(వారే) పరబ్రహ్మమని నమ్మేవారి మతం - శ్రీవిద్య, శ్రీచక్రవిద్య, షట్చక్రవిద్య - శాక్తేయంలో బ్రహ్మవిద్యలు.


 ప్రతి మనిషి వెన్నెముక ద్వారా శక్తి (అమ్మ) పైకి ప్రవహించి నెత్తి నడి మధ్యన (సహస్రారంలో) అయ్య(పరబ్రహ్మాన్ని) కలుస్తుంది ఏ కోటిలో ఒకరికి. కానీ అందరిలో భగవంతుడుని విష్ణువైనా, శివుడైనా, బ్రహ్మైనా, గణపతైనా, లక్ష్మైనా,....) నమ్మే వారికి ఆ శక్తి కొద్దోగొప్పో పైకి ప్రవహించటము మొదలవుతుంది. అది (ఆ ప్రవాహం) నిలబడటానికి మన పూర్వీకులు ‘పంచోపచార’ అర్చన బోధించారు-ఇంటా,కోవెలలో(బయటా). షట్కచక్రాలలో 5 పంచభూతాలే, మనం లోపలా, బయట చూడగలిగేవి. 

పంచ భూతం -  చక్రం పేరు-మనిషిలో

ఆకాశం.        -విశుద్ధం.        - కంఠం

వాయువు.    - అనాహతం. -ఛాతిమధ్య

అగ్ని.             - మణిపురం.  - నాభి

జలం(నీరు).   స్వాధిష్టానం - నాభి/పీఠం

భూమి(పదార్ధం). -మూలాధారం-పీఠం

అందుకుని అర్చనల్లో విధిగా పంచభూత సంబంధమైన విధులు కూర్చారు. 

మంత్రము (శబ్దం - ఆకాశము)

గంథం      (వాయువు)

హారతి       (అగ్ని)

తీర్థం         (జలం)

ప్రసాదము -పదార్థం (భూమి)

సాధనాంశమేంటి? ఈ 5 విధివిధానలు భక్తునిపై ప్రభావము చూపి, భక్తునిలో శక్తిని పైకి ప్రసరింపచేస్తుందేమో!!!

ఈ 5 చక్రాలపైన ఉండేదే ‘ఆజ్ఞా’ చక్రం. అది కేవలం ప్రాణాయామ సంయుత ధ్యానము ద్వారానే చేర సాధ్యం. 

దాని పైన ఉండే సహస్రారం దాదాపు అసాధ్యం, కేవలం పైవాడి దయే!!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగులో టైప్ చెయ్యటం ఎలా?

కుండలినీ యోగ - భౌతిక శాస్త్రం

అలౌకికం-లౌకికం