అధ్యాయం-ఆనందం
ఆనందమనే సముద్రంలో తేలియాడతాడు మనిషి చిన్నతనంలో . ఆ సమద్రతరంగాలు ఉవ్వెత్తున ఎగిసేందుకు కారణాలు చిన్నతనంలోని కొన్ని సంఘటనలూ , కొందరు వ్యక్తులూ . కాలక్రమేణా మనకు కేవలం తరంగాలు , సంఘటనలూ , వ్యక్తులూ గుర్తుండిపోతారు . గాఢమైన ఆనందము తాలూకు ఛాయలైన ఈ తరంగాలు లోతైన ఆ ఆనందానికి కేవలం సంకేతాలుగా మిగిలి - ఆ ఆనందం విలువ తెలిసినా - ఆ ఆనందమెలా మళ్లీ పొందాలో తెలియదు . ఆ వ్యక్తులూ , సంఘటనల వల్లనే ఆనందం కలిగిందని , వారు లేక ఆనందం లేదని బా ధ కలుగుతుంది , కానీ ఆ వ్యక్తులు , సంఘటనలూ ప్రతి వ్యక్తి ఆనంద ( సముద్రం లోని ) వీచికలే ... సముద్రం అలాగే ఉంటుంది , కొత్త తరంగాలు వస్తూ ఉంటాయి...