పోస్ట్‌లు

డిసెంబర్, 2017లోని పోస్ట్‌లను చూపుతోంది

తెలుగులో టైప్ చెయ్యటం ఎలా?

చిత్రం
Snapshot 1 Snapshot 2 Snapshot 3 Snapshot 4 ముందు తెలుగులో ఎందుకు   టైపు చెయ్యాలి ? “ జననీ , జన్మ భూమిశ్చ స్వర్గాత్ అపి గరీయసి ” అన్నారు మన పెద్దలు. ఈ వాక్యం మీ అందరి హృదయాలలో ఎప్పటికీ నిలిచే ఉంటుందని నాకు తెలుసు. కన్నతల్లి లాగానే మాతృభాషని   ఆదరించాలి. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉద్భవించిన వేదాలు , ఉపనిషత్తులు , ఇతిహాసాలు కేవలం మౌఖికంగా తరతరాలకు సక్రమించేలా చేసారు మన ఋషులు. అదెంత కష్టమో , ఎందుకు ఆలా చేశారో ఒక్క క్షణం ఆలోచిస్తే , మనకూ   మన మాతృ భాషనీ మన తరవాత తరాలకు అందించే బాధ్యత ఉందని స్ఫురిస్తుంది. ఇంగ్లిష్ వచ్చాక మన జీవితంలో కొన్ని తెలుగు పదాలు మాయమవుతున్నాయి. టెక్నాలజీ వచ్చాక , తెలుగులో వ్రాయటం తగ్గి పోతోంది. ఇంకా మన తరవాత తరాల వారికి తెలుగు లిఫి తెలియక పొతే , మనకున్న సాహిత్యం అంతా వృధా. మన పూర్వీకులు మనకు ఇచ్చిన సాహిత్య సంపద మనం తరవాత తరాలకు అందించాలంటే ఇది కనీస బాధ్యత అని నాకు అన్పిస్తోంది. మీకూడా అన్పిస్తే , ముందుకు సాగి తెలుగులో ఎలా టైపు చెయ్యాలో తెలుసుకుని , కొంచెం శ్రమ తీసుకుని తెలుగులోనే టైప్ చెయ్యండి. “ అలికి మేలు చెయ్యటం ఊరుకు గొప్ప కాదు ”,...

భగవంతుని నిర్వచనం

భగవంతుని నిర్వచించటము అసాధ్యం..అలాగని భక్తుడు ఊర్కొనలేడు, తన జీవితాంతము ఆలోచించి, ఆలపించి, రచించి ఆయన్ని నిర్వచిస్తూనే ఉంటాడు. ఆ రచన ఆగదు, ఆ నిర్వచనం ముగియదు, ముగించాలనీ భక్తుడూ అనుకోడు. కానీ తన ఆలాపన ద్వారా, రచనలద్వారా భక్తుడు భగవంతునిక దగ్గరవుతూంటాడు. నిర్వచనము సంపూర్ణం చేయటానికి భగవంతుడే భక్తుని తనలో చేర్చుకుంటాడు, కాక సంపూర్ణ నిర్వచనం అసాధ్యం కేవలం భక్తిమాత్రమే ఉండి, రసోద్వేగం కొరవైన భక్తులు ఆ ఆలాపనలు, రచనలు చదివీ, భావించీ భగవంతుని మరింత తెలుసుకుంటారు. అనంతమై, అవ్యయమైన ఈ భగవాన్నిర్వచనా నిధిలో కొన్ని పార్శ్వాలను కొందరు భక్తులు అమితంగా ప్రేమించి, స్వంతం చేసికొని ఆ ఊహలో బందీలై ఆ ఊహలకు ఇమడని భక్తి తత్వాన్ని విమర్శిస్తారు. ఆ విమర్శల ద్వారా ఇతరులనే కాక తమను తామే విమర్శించుకుంటున్నారని గ్రహించలేరు. ఎందుకంటే భగవంతుడు సంపూర్ణం, ఆయన పై మానవుడి నిర్వచనం కాదు.  ఓం పూర్ణమద: పూర్ణమిద: పూర్ణాత్పూర్ణ ముదుచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాయశిష్యతే!!  అలాంటి సంపూర్ణమైన భగవంతుని సంపూర్ణంగా నిర్వచించగలిగాననే దుస్సాహసం నిజమైన భక్తుడెవరూ చేయలేడు. పార్శ్వ నిర్వచనాన...