తెలుగులో టైప్ చెయ్యటం ఎలా?

Snapshot 1

Snapshot 2

Snapshot 3

Snapshot 4


ముందు తెలుగులో ఎందుకు  టైపు చెయ్యాలి?

జననీ, జన్మ భూమిశ్చ స్వర్గాత్ అపి గరీయసిఅన్నారు మన పెద్దలు.

ఈ వాక్యం మీ అందరి హృదయాలలో ఎప్పటికీ నిలిచే ఉంటుందని నాకు తెలుసు. కన్నతల్లి లాగానే మాతృభాషని  ఆదరించాలి. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉద్భవించిన వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు కేవలం మౌఖికంగా తరతరాలకు సక్రమించేలా చేసారు మన ఋషులు. అదెంత కష్టమో, ఎందుకు ఆలా చేశారో ఒక్క క్షణం ఆలోచిస్తే, మనకూ  మన మాతృ భాషనీ మన తరవాత తరాలకు అందించే బాధ్యత ఉందని స్ఫురిస్తుంది. ఇంగ్లిష్ వచ్చాక మన జీవితంలో కొన్ని తెలుగు పదాలు మాయమవుతున్నాయి. టెక్నాలజీ వచ్చాక, తెలుగులో వ్రాయటం తగ్గి పోతోంది. ఇంకా మన తరవాత తరాల వారికి తెలుగు లిఫి తెలియక పొతే, మనకున్న సాహిత్యం అంతా వృధా. మన పూర్వీకులు మనకు ఇచ్చిన సాహిత్య సంపద మనం తరవాత తరాలకు అందించాలంటే ఇది కనీస బాధ్యత అని నాకు అన్పిస్తోంది. మీకూడా అన్పిస్తే, ముందుకు సాగి తెలుగులో ఎలా టైపు చెయ్యాలో తెలుసుకుని, కొంచెం శ్రమ తీసుకుని తెలుగులోనే టైప్ చెయ్యండి.అలికి మేలు చెయ్యటం ఊరుకు గొప్ప కాదు”, ఇది ఎవరి కోసమో కాదు, మనకోసం.

తెలుగులో ఎలా టైపు చెయ్యాలి?

మీ స్మార్ట్ ఫోన్ ఐఫోన్ ఐతే ..ఇలా చెయ్యండి
స్టెప్ 1: ముందు అవసరమయిన సెట్టింగ్స్ లో తెలుగు కీ బోర్డు ఎంచుకోండి [ఎలా?]

ఐఫోన్ సెట్టింగ్స్ లో ఈ క్రింద ఇచ్చిన విధంగా క్లిక్ చేసుకుంటూ వెళితె తెలుగు కీబోర్డ్ వస్తుంది:
Settings => General =>Keyboard>>Keyboards>Add New Keyboard…> ఇపుడు ఏ ఏ  భాషల్లో ఐఫోన్ కీబోర్డులు ఉన్నాయో వరుసగా ఉంటాయి, అందులొచ్చి తెలుగు కీబోర్డ్ క్లిక్ చెయ్యండి. అంతే, తెలుగు కీబోర్డ్ వచ్చేసింది.

స్టెప్ 2: ఇపుడు మీ ఫోన్ లో ఇంగ్లీషు, తెలుగు కీ బోర్డులు రెండూ ఉన్నాయన్నమాట. అవసరమయ్యినపుడు ఇంగ్లిష్, తెలుగు కీ బోర్డు లో గ్లొబ్ బటన్ నొక్కితే తెలుగు కీబోర్డ్ వస్తుంది, ఇంకా తెలుగులో టైపింగ్ చెయ్యండి. ఈ క్రింద మెళకువలు నేర్చుకుంటే, 1-2 నెలల్లో, చక చక తెలుగు లో మీరు మీ కార్య కలాపాలన్నీచెయ్య గలరు.

తెలుగు కీబోర్డ్ వాడటం ఇంగ్లిష్ కన్నా కొంచెం కష్టం, ఎందుకంటే ఇంగ్లిష్ భాషలో ఉన్న 26 అక్షరాలకు  అనుగుణంగా కంప్యూటర్ లో కీ బోర్డు తయారు అయ్యింది. ఐతే తెలుగు భాషలో ఎక్కువ అక్షరాలూ ఉండటం వల్ల, తెలుగుకి 2 కీబోర్డులు కావలిసి వచ్చింది. వాటిని కీబోర్డ్ 1, కీబోర్డ్ 2 అందాం. కీబోర్డ్ 1 మనకి ఎప్పుడు తెలుగు కీబోర్డ్ వాడుతున్నా అందుబాటులో ఉంటుంది. కీబోర్డ్ 2 కావాలంటే, “బటన్ నొక్కాలి. వాడంగానే అర్ధం ఐపోతుంది.   

                                                      కీ బోర్డు -1
                                                           కీ బోర్డు -2

ముందు ఈ కీ బోర్డుల్లో తెలుగు అక్షరాలు ఎలా అమర్చారో తెలుసుకుంటే, మనకి వాడటం కొంచెం సులభం అవుతుంది. చాలా మంది ఇది తెలుసు కోకుండా వాడటం మొదలు పెట్టి, తప్పులు దొర్లి, ఒక్క వాక్యం వ్రాయాలంటే ఎక్కువ సమయం పట్టి, విసుగుతో ఇంగ్లిష్ కీబోర్డ్ నే వాడుతున్నారని నా గట్టి అభిప్రాయం.

అచ్చులు, హల్లులు, గుణింతాలు - ఇది మన తెలుగు ప్రత్యేకత

తెలుగులో అచ్చులు, హల్లులు ఉన్నాయి. గుణింతాలు ఉన్నాయి. మనం నెలల తరబడి శ్రమ తీసుకుని ఒకటవ తరగతి లోనే అవి నేర్చు కున్నాం. ఇప్పుడు అంత శ్రమ అవసరం లేదు గాని, అవి కీబోర్డ్ లో ఎక్కడ, ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి.

A.            హల్లులలో సరళమయినవి [ఉదాహరణకి: క, , , , ప ), కఠినమయినవి [ఖ, , ,,ఫ]  ఉన్నాయి.
B.            కీబోర్డ్ 1 ఉన్న అక్షరాలు: గుణింతాలు, సరళమయిన హల్లులు
C.           కీబోర్డ్ 2 ఉన్న అక్షరాలు: అచ్చులు, కఠినమయిన హల్లులు
D.           రెండింటిలోనూ 31 కీస్ ఉన్నాయి - కచ్చింతగా అదే అమరికతో కేవలం కీస్ మీద ఉన్న అక్షరాలూ [సరళ అక్షరాలు కఠిన అక్షరాలు, ఇంకా గుణింతాలు అచ్చులు గా] మారాయి.
E.            కీబోర్డ్ 1, కీబోర్డ్ 2 క్రింద ఉన్నాయి, కొంచెం పరీక్షగా చూడండి. D లో ఉన్న అంశం, సులభంగా అర్ధం అవుతుంది.
F.            కీబోర్డ్ 1 లో గుణింతాలుకుఉదాహరణగా వాడబడింది. కొంచెం వాడండి అర్థం అవుతుంది.

ముందుగా హల్లులు ఎలా ఉన్నాయో చూద్దాం

ఇప్పుడు మీరు, కీబోర్డు 2 మీద కీబోర్డ్ 1 ఉన్నట్లు ఊహించుకోండి. ఈ కీబోర్డ్ తయారు చేసినవారు, అది మనకి సులభంగా వాడుకునేటట్లు అమర్చారు. కీబోర్డ్ 1 లోఉన్న స్థానంలోనే కీబోర్డ్ 2 లోఉంది, అలాగే, ‘’, ‘వగైరా. ఒకసారి మీరు పరిశీలించండి. ఇది తెలిస్తే, మీ హల్లులు టైప్ చెయ్యటానికి పట్టే  శ్రమ 50% తగ్గినట్లే కదా.

అచ్చులు, గుణింతాలు ఎలా ఉన్నాయో చూద్దాం:

అచ్చులకి, గుణింతాలకి గట్టి లంకె ఉంది, మనకి తెలుసు. అచ్చులకి గుణింతాలు అవసరం లేదుకానీ, హల్లులకి ఉంది. ఉదాహరణకి, చూడండి:

నుంచికా’, ‘గా’, ‘యావగైరాలు వస్తాయి. అందుకని కీబోర్డ్ 2 లో అచ్చు ఉన్న స్థానంలోనే దానికి సంబందించిన గుణింతం యొక్క సంకేతము ఉంటుంది.

ఇంకామీద’, ‘మీద’, ‘మీదవగైరా ఉన్నాయి. కొన్ని అచ్చులు మరింత ముద్దుగా ఉంటాయి.’,’’,’’, ‘’,’’,’చూస్తే ఇవి దగ్గరగా ఒక వరసలో ఉన్నాయి. వీటికి సంబంధించిన గుణింతాలు కీబోర్డ్ 1 లో, కచ్చితంగా వాటి పయినే ఉంటాయి. ఒకసారి పరిశీలించండి పైన ఉన్న 2 కీబోర్డులు ఒక సరి పరీక్షగా చూడండి. సగం టైపింగ్ శ్రమ ఇప్పుడే తగ్గి పోయింది.

వాడే విధానం, ఎలా వేగంగా చెయ్యవచ్చును:  

ఇపుడు ఈ అక్షరాలు ఎలా ఉన్నాయన్న విషయం తెలిసాక వాడటం మొదలు పెట్టాలి. టైపు రైటర్ నేర్చుకున్నవాళ్లకి సులభంగా తెలుసు. 2 చేతులు, 10 వేళ్ళు వాడితే వేగం పెరుగు తుంది. ఆలా వాడే వాళ్ళకి కూడా, ఇంగ్లిష్ కీబోర్డ్ అలవాటు వల్ల తెలుగు కీబోర్డ్ కొద్దిగా కష్టం అనిపిస్తుంది. ముఖ్య మయిన సూచన ఏమిటంటే, ఒక వేలుతో కాకుండా అన్ని వేళ్ళతో టైపు చెయ్యండి. ఫోన్ చిన్నదై కష్టంగా ఉంటుంది కానీ, రెండు చేతులతో చెయ్యటం అలవాటు చేసుకుంటే, ఇంగ్లిష్ కన్నా తెలుగు టైపింగ్ వేగంగా అవుతుంది.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కుండలినీ యోగ - భౌతిక శాస్త్రం

అలౌకికం-లౌకికం