పోస్ట్‌లు

2019లోని పోస్ట్‌లను చూపుతోంది

నామ రామాయణము

నామ రామాయణము భారత రత్న సుబ్బలక్ష్మి గారి అతి మధురమైన గాత్రం నుండి అమృతంలాగా వెలువడే నామ రామాయణం మనందరికీ మనసు పులకింప చేస్తుంది. గానంతో పాటుగా అర్ధం కూడా తెలుసుకుంటే దివ్యమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ గాన కావ్యానికి అర్ధం తెలియ చెప్పే ప్రయత్నము ఇది. ముందు చరణం, ప్రతిపదార్థము, తాత్పర్యము ఇచ్చాను. ఇచ్చిన అర్ధము తప్పనిపించినా లేక సరి అయిన అర్ధము కాకున్నా, క్రింద వ్యాఖ్య చెయ్య గలరు. బాలకాండము : (ఈ రామాయణములోని ప్రతి నామమూ 'రామ' అన్న పాదముతో సంపూర్ణం అవుతుంది. పునరుక్తి దోషం లేకుండ 'రామ' అన్న పదము ఆ కోదండ రాముని సూచిస్తుందని తెలుసుకొన గలరు.) శుద్దబ్రహ్మ  పరాత్పర రామ | కాలాత్మక పరమేశ్వర రామ | శుద్దబ్రహ్మ  = పరబ్రహ్మ (నిర్గుణ రూపము మించిన శుద్ధత లేదు), పరాత్పర= పరాత్ + పర = పరముని మించిన పరము= అన్నింటిని మించినది. పరం అంటేనే అత్యున్నతం, దాన్ని మించి ఏమీ లేదని కదా. మరి పరాత్పరం ఏమిటి? కాలాత్మక = కాలభ్రమణానికి మూలమైన; పరమేశ్వర= ఈశ్వరులలో పరమయిన [మళ్ళీ పరబ్రహ్మ అన్న సూచన] శేషతల్ప సుఖ నిద్రిత రామ, బ్రహ్మత్ అమర ప్రార్ధిత రామ శేషతల్ప= ఆదిశేషుని పరుప...

హనుమాన్ చాలీసా

మకుటం: హునుమాన్ చాలీసా చాలీసా =నలభై. ఉన్న శ్లోకాల సంఖ్య. తులసీదాసు రామచరితమానసలోనిది. ‘శ్రీ గురు చరణ.....’ అన్న (దీన్నేమనాలో తెలీదు, శ్లోకం కాదు - శ్లోకంలో 16 అక్షరాల పాదాలు రెండు ఉంటాయి) తలసీదాసు మొదటి పాదంలో తన గురువు పాదధూళిని ఉద్దేశించుంటాడు, రాముడు ఫలమునిచ్చేవానిగా, హనుమంతుడు క్లేశాలను తొలగించి విద్యాబుద్ధులు ఇవ్వమని ప్రార్ధించినట్లుంది శ్రీ = సనాతన ధర్మంలో శుభసంకేతం, గురుచరణ = గురువుయొక్క పాద సరోజ= పద్మ, రజ=రేణువు (ఇక్కడ ధూళి),  నిజమన=నా మనస్సు, మకుర=?, సుధారి=అమృతం(?), వరణౌ, రఘవర=రఘువంశంలో శ్రేష్టుడు(రాముడు), విమల=అమలాన్ని మించి (నిర్మలమైన); యశ=యశస్సు; జోదాయక=ఏదైతే ఇస్తుందో; ఫలచారి=ఫలాన్నిఇచ్చేది (యశస్సనే ఫలాన్ని ఇచ్చే); బుద్ధహీనతను; జానికే=తెలుసుకొనటానికి; సుమిరో (స్మరౌ అన్న పదంలాగా)=స్మరించు; పవనకుమార; బలబుద్ధి; దేహు(దేహికి పదాంతరం)=ఇవ్వు; మోహి=నా; కలేశ=క్లేశము;వికార్; [వదిన] 1 వ పాదం- ప్రతిపదార్ధము, తాత్పర్యం సహితం 1జై హనుమాన్ జ్ఞానగుణ సాగర జ్ఞాన గుణ సాగరుడైన హనుమా జయమవుగాక జయకపీశ తిహు లోక ఉజాగర ముల్లోకాలను ప్రకాశింప జేయు  కపీశ !జయమవు గాక! ఉజాగర...