నామ రామాయణము

నామ రామాయణము



భారత రత్న సుబ్బలక్ష్మి గారి అతి మధురమైన గాత్రం నుండి అమృతంలాగా వెలువడే నామ రామాయణం మనందరికీ మనసు పులకింప చేస్తుంది. గానంతో పాటుగా అర్ధం కూడా తెలుసుకుంటే దివ్యమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ గాన కావ్యానికి అర్ధం తెలియ చెప్పే ప్రయత్నము ఇది.


ముందు చరణం, ప్రతిపదార్థము, తాత్పర్యము ఇచ్చాను. ఇచ్చిన అర్ధము తప్పనిపించినా లేక సరి అయిన అర్ధము కాకున్నా, క్రింద వ్యాఖ్య చెయ్య గలరు.


బాలకాండము :


(ఈ రామాయణములోని ప్రతి నామమూ 'రామ' అన్న పాదముతో సంపూర్ణం అవుతుంది. పునరుక్తి దోషం లేకుండ 'రామ' అన్న పదము ఆ కోదండ రాముని సూచిస్తుందని తెలుసుకొన గలరు.)



శుద్దబ్రహ్మ  పరాత్పర రామ | కాలాత్మక పరమేశ్వర రామ |



శుద్దబ్రహ్మ  = పరబ్రహ్మ (నిర్గుణ రూపము మించిన శుద్ధత లేదు),
పరాత్పర= పరాత్ + పర = పరముని మించిన పరము= అన్నింటిని మించినది. పరం అంటేనే అత్యున్నతం, దాన్ని మించి ఏమీ లేదని కదా. మరి పరాత్పరం ఏమిటి?
కాలాత్మక = కాలభ్రమణానికి మూలమైన;
పరమేశ్వర= ఈశ్వరులలో పరమయిన [మళ్ళీ పరబ్రహ్మ అన్న సూచన]



శేషతల్ప సుఖ నిద్రిత రామ, బ్రహ్మత్ అమర ప్రార్ధిత రామ



శేషతల్ప= ఆదిశేషుని పరుపుగా చేసుకొని, సుఖనిద్రిత= యోగనిద్రలో ఉన్న
బ్రహ్మాది అమర = బ్రహ్మా మొదలగు దేవతలు, ప్రార్ధిత=ప్రార్ధించిన

చండకిరణకుల మండన రామ, శ్రీమద్దశరథనందన రామ,


కౌసల్యా సుఖ వర్ధన రామ, విశ్వామిత్ర ప్రియధన రామ,


కౌసల్య సుఖ వర్ధన = ఇక్కడ సుఖం అంటే సంతోషం, ఆనందం. ఈ రెండూ లేని సుఖాన్ని ఎవరూ కోరుకోరు. అలాంటి అనుభవాన్ని పెంచే రాముడు. సంతోషముగా ఉండటం అనేది ఒక గొప్ప విషయం. అది ఒక మానసిక స్థితి. ఆ స్థితి నిలకడగా ఉండటమే కాక దిన దిన వర్ధమానం అవటం ఒక విశేషం.


విశ్వామిత్ర ప్రియధన రామ = ధనం మనిషికి, జంతుజాతికీ జీవనావసరమే కాక ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, సంతానాన్ని, ఐశ్వర్యాన్ని, ఆలా అష్ట ఐశ్వర్యాలను ఇస్తుంది. అష్టలక్ష్మి మనకి ఆ సూచనే ఇస్తుంది. (మనిషి నోట్లను ధనము అనుకోవటం మొదలయ్యాక, వ్యాపారాలు నోట్ల ద్వారా, తరవాత్తరవాత ఎలెక్ట్రానిక్ గా మారాక, ధనం యొక్క విలువ గురించి ప్రపంచం తప్పుడు అభిప్రాయంలో ఉంది, ఉండిపోతోంది. శ్రీసూక్తములో 'ధనమగ్ని, ధనం వాయుః, ధనం ఇంద్రో బృహాస్పతిః'. అగ్ని, వాయువు లేని ప్రపంచంలో మనం జీవించగలమా? అనంతముగా దొరుకుతున్న దాని పట్ల మనిషి ఉదాసీనంగా ఉంటాడు. ఒకప్పుడు ఉచితంగా లభించే మంచి నీరు  ఇప్పుడు కొనుక్కోవాలి. ప్రాణవాయువు కొనుక్కుంటున్నాం ఇప్పుడు. ఇంద్రియాలు వశంలో లేనప్పుడు, ఎంత నోట్ల ధనముండీ ఏమి సుఖం? బుద్ధి స్థిరంగా ఉంటె మనస్సు స్థిరంగా ఉంటుంది. నిలకడ లేని మనస్సు ఉన్నప్పుడు, ఎంత డబ్బు, శారీరక సుఖాన్ని ఇస్తుంది కానీ, శాంతినీ, ఆనందాన్నీ ఇవ్వలేదు) బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రునికి ధనం అవసరమేముంది?



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగులో టైప్ చెయ్యటం ఎలా?

కుండలినీ యోగ - భౌతిక శాస్త్రం

అలౌకికం-లౌకికం