హనుమాన్ చాలీసా

మకుటం: హునుమాన్ చాలీసా

చాలీసా =నలభై. ఉన్న శ్లోకాల సంఖ్య.
తులసీదాసు రామచరితమానసలోనిది.

‘శ్రీ గురు చరణ.....’ అన్న (దీన్నేమనాలో తెలీదు, శ్లోకం కాదు - శ్లోకంలో 16 అక్షరాల పాదాలు రెండు ఉంటాయి)
తలసీదాసు మొదటి పాదంలో తన గురువు పాదధూళిని ఉద్దేశించుంటాడు, రాముడు ఫలమునిచ్చేవానిగా, హనుమంతుడు క్లేశాలను తొలగించి విద్యాబుద్ధులు ఇవ్వమని ప్రార్ధించినట్లుంది

శ్రీ = సనాతన ధర్మంలో శుభసంకేతం,
గురుచరణ = గురువుయొక్క పాద
సరోజ= పద్మ, రజ=రేణువు (ఇక్కడ ధూళి),  నిజమన=నా మనస్సు, మకుర=?, సుధారి=అమృతం(?),
వరణౌ, రఘవర=రఘువంశంలో శ్రేష్టుడు(రాముడు), విమల=అమలాన్ని మించి (నిర్మలమైన); యశ=యశస్సు; జోదాయక=ఏదైతే ఇస్తుందో; ఫలచారి=ఫలాన్నిఇచ్చేది (యశస్సనే ఫలాన్ని ఇచ్చే); బుద్ధహీనతను; జానికే=తెలుసుకొనటానికి; సుమిరో (స్మరౌ అన్న పదంలాగా)=స్మరించు; పవనకుమార; బలబుద్ధి; దేహు(దేహికి పదాంతరం)=ఇవ్వు; మోహి=నా; కలేశ=క్లేశము;వికార్;

[వదిన]
1 వ పాదం- ప్రతిపదార్ధము, తాత్పర్యం సహితం

1జై హనుమాన్ జ్ఞానగుణ సాగర
జ్ఞాన గుణ సాగరుడైన హనుమా జయమవుగాక
జయకపీశ తిహు లోక ఉజాగర
ముల్లోకాలను ప్రకాశింప జేయు  కపీశ !జయమవు గాక!

ఉజాగర   =ప్రకాశింప జేయు
కుమతి నివార =చెడును నివారించు
సుమతికే సంగి  =  మంచి బుద్ధిని ప్రసాదించు

[లక్ష్మి]
2 వ పాదం- ప్రతిపదార్ధము, తాత్పర్యం సహితం
రామదూత, రాముడి చేత రాయబారిగా పంపబడిన,
అతులిత బలధామా, అంతులేని బలము కలవాడా
[లత]
అంజని పుత్ర- అంజని దేవి కుమారుడు, పవనసుత నామా- వాయుపుత్రా అను  పేరు కలవాడా లేక పవన పుత్రా అని పిలవబడే వాడా,

తేజ ప్రతాప-తేజోవంతమయిన ప్రతాపము కలవాడా, మహా జగ వందన- జగత్తులో అందరిచేత గొప్పగా పూజింపబడే వాడా

[వదిన]
3 వ పాదం- ప్రతిపదార్ధము, తాత్పర్యం సహితం
3మహావీర విక్రమ భజరంగీ
కుమతి నివార సుమతికే సంగీ
మహావీర విక్రముడైన భజరంగీ
నాలోని చెడుని పోగొట్టి మంచిని ప్రసాదించు

[లత]
కాంచన వర్ణ విరాజ సువేశ ...   కాంచన-బంగారు, వర్ణ- రంగు, విరాజ-ప్రకాశించే,
సువేశా- అందమైన వేష ధారణ లేదా రూపం , కాననా- చెవులకు, కుండల - కుండలం,
 కుంచిత- మడిచి, కేశ-జుట్టు....

బంగారు రంగుతో ప్రకాశించే మంచి రూపము కలవాడా,
చెవులకు కుండలాలు,మడిచిన జుట్టు కలవాడా.. .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగులో టైప్ చెయ్యటం ఎలా?

కుండలినీ యోగ - భౌతిక శాస్త్రం

అలౌకికం-లౌకికం