పోస్ట్‌లు

మే, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

త్రిమతాల భేదం

  ద్వైత ,  అద్వైత ,  విశిష్టాద్వైతాల   ప్రధాన   భేదానికి   స్పష్టసూచిక శ్రీరాముడు   ఒకసారి   హనుమంతుని   ప్రశ్నించాడట ,  కపీశ్వరుని   సమాధానంలో   ఆయన   పాండిత్యమే   కాక   ఆత్మజ్ఞానమూ ,  సూక్ష్మగ్రాహ్యత   కనపడతాయి .  ఆ   సమాధానమే   ఇది : దేహబుధ్యా   తు   దాసోఽహం   జీవబుధ్యా   త్వదంశకః   ఆత్మబుధ్యా   త్వమేవాహమ్‌   ఇతిమే   నిశ్చితా   మతిః దేహబుద్ధితో   చూస్తే   నీకు   దాసుడను  ( నువ్వూ ,  నేనూ   వేరు   అన్న   ద్వైతం -  ప్రకృతి ),  జీవబుద్ధితో   చూస్తే   నీ   అంశను  ( జీవాత్మ  -  జీవమున్న   ఆత్మ  -  ఆత్మ ,  ప్రకృతి   విడిగా   చూడ   కలిగే   విశిష్టాద్వైతము )  ఆత్మబుద్ధి   పరంగా   నేను   నువ్వే  ( నువ్వూ ,  నేనూ   ఒకటే   అన్న  అద్వైతము  -  రెండు కానిది ).  ఈ   మూడు ...

మనుష్యజన్మ - మోక్షం

 *దుర్లభం త్రయమేవైతద్దేవానుగ్రహ హేతుకమ్!* *మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః!!* మనుష్యజన్మ, మోక్షం పొందాలనే తపన, మహాపురుషుల ఆశ్రయం అనే మూడూ లభించడం దుర్లభం. కేవలం దైవానుగ్రహం వలన మాత్రమే ఇవి ప్రాప్తిస్తాయి.   3 వ శ్లోకం, వివేక చూడామణి శ్రీ జగద్గురు ఆదిశంకర భగవత్పాదులు మనుష్యజన్మ, మోక్షాభిలాషా, మహాపురుషుల ఆశ్రయం - మొదటిది, జన్మ, లభించింది. రెండవది మనకు సరిగ్గా అర్ధంకాక (కోరుకుంటున్నా సరిగ్గా)కోరుకోవటం లేదు. మహా పురుషుల ఆశ్రయం మన చేతిలో లేదు.  ఈ విషయంలో రెండు అంశాలు - ఈ రోజుల్లో మహాపురుషులెవరో కూడా చెప్పలేం. పీఠాధిపతులా, జీయరులా, ప్రవచనకారులా, బాబాలా, ఎవరు? వీరు కాకపోవచ్చును. తను ఆచరించి చూపేవాడు కావాలి. అలాంటి వారు దొరకటం కష్టం, దొరికినా మనకు ఆశ్రయం (మోక్షమార్గానికి/సాధనకు సహాయపడటం) జరగకపోవచ్చును. ఇక మిగిలింది రెండవదే- మోక్షాభిలాష. దీన్నే కొంచెం అస్పష్టంగా - కోరుకుంటున్నా సరిగ్గా కోరుకోవటం లేదు - అన్నాను.  మోక్షమంటే మనకేవో అస్పష్టమైన ఆలోచనలున్నాయి. మనం శ్రద్ధగా ఏ గ్రంథమూ చదవం కనక ఆ అస్పష్టమైన ఆలోచనలతోనో అంటకాగుతూంటాం.  “క్ష” అంటే నాశనమయేది (క్షరము, క్షీణిం...