త్రిమతాల భేదం

 ద్వైతఅద్వైతవిశిష్టాద్వైతాల ప్రధాన భేదానికి స్పష్టసూచిక


శ్రీరాముడు ఒకసారి హనుమంతుని ప్రశ్నించాడటకపీశ్వరుని సమాధానంలో ఆయన పాండిత్యమే కాక ఆత్మజ్ఞానమూసూక్ష్మగ్రాహ్యత కనపడతాయి సమాధానమే ఇది:


దేహబుధ్యా తు దాసోఽహం జీవబుధ్యా త్వదంశకః 
ఆత్మబుధ్యా త్వమేవాహమ్‌ ఇతిమే నిశ్చితా మతిః


దేహబుద్ధితో చూస్తే నీకు దాసుడను (నువ్వూనేనూ వేరు అన్న ద్వైతంప్రకృతి), జీవబుద్ధితో చూస్తే నీ అంశను (జీవాత్మ - జీవమున్న ఆత్మ - ఆత్మప్రకృతి విడిగా చూడ కలిగే విశిష్టాద్వైతముఆత్మబుద్ధి పరంగా నేను నువ్వే (నువ్వూనేనూ ఒకటే అన్న అద్వైతము - రెండు కానిది). 


 మూడు మతాలూ వేదస్థమైన అంశాలుకొత్తగా పుట్టినవి కావుకానీ  పేర్లతో బహుళంగాస్పష్టతతో ప్రచారములోకి వచ్చినది మాత్రము ముగ్గురి మార్గదర్శకుల వల్లన:


ద్వైతమతము - శ్రీ మర్ధ్వాచార్యులు (మాధవాచార్యులుఈయన్నే శయనాచార్యులనీ అంటారు, మతాన్ని ఆచరించే వారిని మర్దవులు అంటారు)

విశిష్టాద్వైతం - శ్రీ రామానుజాచార్యుల వారు 

అద్వైతమతం - శ్రీ శంకరాచార్యుల వారు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగులో టైప్ చెయ్యటం ఎలా?

కుండలినీ యోగ - భౌతిక శాస్త్రం

అలౌకికం-లౌకికం