త్రిమతాల భేదం
ద్వైత , అద్వైత , విశిష్టాద్వైతాల ప్రధాన భేదానికి స్పష్టసూచిక శ్రీరాముడు ఒకసారి హనుమంతుని ప్రశ్నించాడట , కపీశ్వరుని సమాధానంలో ఆయన పాండిత్యమే కాక ఆత్మజ్ఞానమూ , సూక్ష్మగ్రాహ్యత కనపడతాయి . ఆ సమాధానమే ఇది : దేహబుధ్యా తు దాసోఽహం జీవబుధ్యా త్వదంశకః ఆత్మబుధ్యా త్వమేవాహమ్ ఇతిమే నిశ్చితా మతిః దేహబుద్ధితో చూస్తే నీకు దాసుడను ( నువ్వూ , నేనూ వేరు అన్న ద్వైతం - ప్రకృతి ), జీవబుద్ధితో చూస్తే నీ అంశను ( జీవాత్మ - జీవమున్న ఆత్మ - ఆత్మ , ప్రకృతి విడిగా చూడ కలిగే విశిష్టాద్వైతము ) ఆత్మబుద్ధి పరంగా నేను నువ్వే ( నువ్వూ , నేనూ ఒకటే అన్న అద్వైతము - రెండు కానిది ). ఈ మూడు ...