అలౌకికం-లౌకికం

లౌకికం =1, అలౌకికం=0 అనుకుంటే,

(లౌకికాన్ని తగిలించుకుంటూ……….పోతే….

ఎంత = 0+1+1 +1+ +1+ +1+ +1+ +1+ +1+…..

          = 0 +1+(1 +1)+(+1+ +1+ +1)+(+1+…..

          = 0 +1++2+3+4+5+6+7+8+9+10…

          ఎంతో………………………….(అనంతం)


లౌకికమనేది లంపటంఒకదాని తరవాత ఒకటి తగులుతూనే ఉంటుంది అనంతంగాఎప్పటికి లెక్కతేలదుఒక దరికిరాదులౌకకంలో తగులుకున్న మానవుడు లౌకి గానే ఉండిపోతాడుఅలౌకికం పెరగదుచదువుపెళ్లిపిల్లలూఉద్యోగంపిల్లల పెళ్ళి…….. వలయం తిరుగుతూనే ఉంటుంది.


(అలౌకికాన్ని తగిలించుకుంటూ……….పోతే


ఎంత =1+0+0+0+0+0+0+0+0+0+0+0+……

          = 1 (ఎంతో అంతే)


అలౌకికమనేది ఎంత తగిలించుకున్నా పరవాలేదులౌకికం పెరగదులౌకికమైన పనులు పెరగవు (బరువనిపించవు), కానీ లౌకికమైన బాధ్యతలు ఉంటూనే ఉంటాయి కదా …చదువుపెళ్లివగైరాలుబాధించవు


ఇదంతా లెక్కల గారడీఅలౌకికం=0, లౌకికం=1 అనే ఎందుకు తీసుకోవాలిచెప్పాలనుకున్నది చూపించటానికావేరేవిలువలు తీసుకోవచ్చును కదా’ అంటావా?


లౌకికం (లోకం అన్న పదానికి పర్యాయంమనకు కనపడేదిఅందుకని కనపడేవి అంకెలలో చెప్పటానికి 1 తీసుకున్నాను,2,3,4…లలో ఏది తీసుకున్నాఒకే - అదే నిరూపణ అవుతుంది


అయితే పరం (అలౌకికంసత్యంజగన్మిథ్య (లౌకికంఅంటారు కదామరి లౌకికం=0 (మిథ్య అంటే ఏమీలేదు కనుకశూన్యం.., కనుక 0), అలౌకికం = 1 (సత్యంఅంటే ఉందిఅంటే 1,2,3 ఏదో ఒకటితీసుకోవచ్చును కదా..’ అంటావాభేష్ఇదింకా మంచి ప్రతిపాదన (హైపాథిసిస్). ముందు కెళ్ళేలోపు ఒక విషయం.


పరం సత్యంజగన్మిథ్య’ అనేది అలౌకిక దృష్టి, నువ్వు ప్రతిపాదించిన (అలౌకికం = 1, లౌకికం = 0) విధంగా విలువలు తీసుకున్నట్లేఫలితాలు కూడా అలౌకిక దృష్టిలో నిర్వచించాలిదీనికి నువ్వు ఒప్పుకోవాలినీ వాదనానా వాదనా ఒకే భూమిక పైఉండటం సరి న్యాయం కదా.


పైన ఇచ్చిన రెండు ‘ఎంత’ అన్న సమీకరణాలే వాడుకోవచ్చును. ‘’, ‘’ లు తిరిగి ఇలా వ్రాయాలికానీ వాటి ఫలితాలు పైన వలే ఉంటాయి, కానీ తారుమారు అవుతాయి. లెక్కల పద్థతి మారదుఫలితాలు మాత్రం అలౌకిక దృష్టిలో చూడాలి -అది ఇప్పుడే అంగీకరించాం)


అలౌకికాన్ని తగిలించుకుంటూ……….పోతే

0+1+1+1+1+1+1+1+1+1+1+1+1+1+1+1+……….. ఎంత?

+1++2+3+4+5+6+7+8+9+10……?


ఎంతఎంతో…….(అనంతంఅని  తెలుసుకున్నాం కదాఅంటే అలౌకికాన్ని తగిలించుకున్న కొద్దీ తగులుకుంటూనేఉంటుందిఅలౌకికం అనంతం. “పరం సత్యం” అంటే అలౌకిక దృష్టిలో దాని అర్ధం పరమాత్మ అనంతంఅన్నింటా ఉన్నాడుఅందరిలోఉన్నాడుఅన్ని కర్మలలో (పనులలోఅలౌకికభావం పెంచుకు(తగులుకోవటంపోవటం ‘సమర్పణ’ భావం.


(లౌకికాన్ని తగిలించుకుంటూ……….పోతే


  ఎంత= 1 (ఎంతో అంతే)


ఇక్కడ అలౌకిక దృష్టిలో 1 అన్నది ‘పరం సత్యం’ అని సూచించినది కనుక, ‘జగన్మిథ్య’ అన్న భావనతోనే కర్మలు చేస్తూపోవాలిఫలితం ‘పరం సత్యం’ అన్న భావన మిగులుతుందిబలపడుతుంది.


కనక  విధంగా చూసిన పరమాత్మ (కు అంకిత భావంతో కర్మలు సమర్పిస్తూవైపుకు ప్రయాణిస్తూ ఉంటే మనబాధ్యతలు బరువు ( ఆయన తేలిక పరుస్తాడు కనుకఅనిపించవు-పైగా అవే లౌకిక బాధ్యతలు ఆనందాన్నిస్తాయి.


దీనికి వయస్సుతో సంబంధం లేదుభావన ముఖ్యంముందు భావన రావాలిసాధన పెరుగుతూంటూందిపెరుగుతున్న సాధన భావాన్ని మరీ బలీయం చేస్తుంది


భావన —->>>సాధన 

సాధన ——>>>భావన 

భావన —->>>సాధన 

సాధన ——>>>భావన

భావన —->>>సాధన 

సాధన ——>>>భావన

……….

………..


అదొక చక్రం లా సాగి భావనసాధన పరస్పరం బలపడతాయిపెరుగుతాయి..!!!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగులో టైప్ చెయ్యటం ఎలా?

కుండలినీ యోగ - భౌతిక శాస్త్రం