పోస్ట్‌లు

2020లోని పోస్ట్‌లను చూపుతోంది

శాక్తేయం-అర్చన

అమ్మ(వారే) పరబ్రహ్మమని నమ్మేవారి మతం - శ్రీవిద్య, శ్రీచక్రవిద్య, షట్చక్రవిద్య - శాక్తేయంలో బ్రహ్మవిద్యలు.  ప్రతి మనిషి వెన్నెముక ద్వారా శక్తి (అమ్మ) పైకి ప్రవహించి నెత్తి నడి మధ్యన (సహస్రారంలో) అయ్య(పరబ్రహ్మాన్ని) కలుస్తుంది ఏ కోటిలో ఒకరికి. కానీ అందరిలో భగవంతుడుని విష్ణువైనా, శివుడైనా, బ్రహ్మైనా, గణపతైనా, లక్ష్మైనా,....) నమ్మే వారికి ఆ శక్తి కొద్దోగొప్పో పైకి ప్రవహించటము మొదలవుతుంది. అది (ఆ ప్రవాహం) నిలబడటానికి మన పూర్వీకులు ‘పంచోపచార’ అర్చన బోధించారు-ఇంటా,కోవెలలో(బయటా). షట్కచక్రాలలో 5 పంచభూతాలే, మనం లోపలా, బయట చూడగలిగేవి.  పంచ భూతం -  చక్రం పేరు-మనిషిలో ఆకాశం.        -విశుద్ధం.        - కంఠం వాయువు.    - అనాహతం. -ఛాతిమధ్య అగ్ని.             - మణిపురం.  - నాభి జలం(నీరు).   స్వాధిష్టానం - నాభి/పీఠం భూమి(పదార్ధం). -మూలాధారం-పీఠం అందుకుని అర్చనల్లో విధిగా పంచభూత సంబంధమైన విధులు కూర్చారు.  మంత్రము (శబ్దం - ఆకాశము) గంథం      (వాయువు) హారతి       (అగ్ని)...

తెలుగు టైపింగులో మెళకువలు

చిత్రం
ముందుగా తెలుగు కీబోర్డులో అక్షరాలు ఎలా అమర్చబడ్డాయో చూద్దాం. తెలుగు అక్షరమాల పెద్దది కనుక అచ్చులూ, హల్లులూ, గుణింతాలూ అన్నింటినీ రెండు బోర్డులలో కూర్చారు. మొదటిబోర్డులో అచ్చులూ, కఠిన హల్లులూ ఉన్నాయి. రెండో బోర్డులో గుడింతాలూ, సరళ హల్లులూ ఉన్నాయి. వాటి వివరాలలోకి వెళదాం. మొదటి బోర్డులో ఎడంవైపు అచ్చులన్నీ ఉంటాయి. కుడివైపు కఠిన హల్లులూ.  పై చిత్రం చూస్తే ఇలా తెలుస్తుంది. అ,ఇ, ఉ అచ్చుల దీర్ఘాలు సరిగ్గా వాటిపైనే ఉన్నాయి. అలాగే ఎ,ఏ,ఐ,ఒఓ,ఔ లు కూడా. ఇక హల్లులకు వద్దాం, క్రింది చిత్రం చూడండి. హల్లులలో ఒక అక్షరక్రమం లేకున్నా క,చ,ట,త, ప లు ఒక దగ్గరగా ఉన్నాయి. వాటికి పైగా గ,జ,డ,ద,బ లున్నాయ్. క్రింద య,ర,ల,వ, స లున్నాయ్. ఇవన్నీ సరళంగా పలికే హల్లులు. ఒక్కొక్క సరళహల్లుకూ కఠిన హల్లు అదే స్థానంలో రెండో బోర్డులో ఉన్నాయ్. ఎలాగంటే క-ఖ, చ-ఛ, ట-ఠ,.... వగైరా. క్రింద చిత్రం చూడండి: రెండో కీ బోర్డులో ఎడం వైపు గుణింతాలుంటాయి - పై చిత్రంలో ర-గుణింతాలున్నాయి ఉదాహరణగా. అవే గుణింతాలు అన్ని హల్లులకు పనికొస్తాయి.  రెండో కీబోర్డులో కుడివైపు కొన్ని హల్లులుంటాయి

స్తోత్రపఠనం

నవ విధ భక్తిలో పూజనము విశేష స్థానము కలిగినది. దేవుని ఆరాధించే సులువైన మార్గము. అనేక భక్తులు వీలైనప్పుడు / కొందరు ప్రతి దినమూ దేవతార్చన చేస్తూంటారు. మన సనాతన శాస్త్రములైన పురాణములలో అనేక స్తోత్రములు, అష్టోత్తరాలూ, సహస్రనామాలు ఉన్నాయి. ప్రతి స్తోత్రానికి ఉపోద్ఘాతము, స్తోత్రమూ, ఫలశ్రుతి  ఉంటాయి.  సంస్కృత భాష భారతీయుల సంస్కృతిలో, జీవనములోనూ భాగమై ఉంది. వేదాలూ, ఉపనిషత్తులూ, పురాణాలూ, ఇతిహాసాలూ, సంహితలూ మొదలగనవి అన్నీ సంస్కృతములో లిఖించబడి భారతీయ వాజ్మయముతో పెనవేసుకుపోయాయి. ఈ శాస్త్రాల పట్ల భారతీయులకు పవిత్రమైన భావనే కాక ఆరాధనా భావను కూడా ఉన్నాయి. చిన్నప్పటినుంటి ఈ శాస్త్రాలను, వాటిలోని చిన్న భాగాలనైనా వింటూ భారతీయులు పెరిగారు. మాతృభాష సంస్కృతము కాకపోయినా సంస్కృతములో ప్రవేశము లేకపోయినా సంస్కృత మంత్రాలను, శ్లోకాలను విన్న వెంటనే ప్రతి భారతీయుడు పవిత్రమైన భావానికి లోనవుతాడు. ఈ నేపథ్యంలో శ్రద్ధ కలిగిన భక్తులు దేవతార్చన చేయునప్పుడు సంస్కృతములోని శ్లోకాలూ, మంత్రాలూ పూర్తిగా అర్థము కాకపోయినా అర్చనానంతరము మానసికంగా ఉత్తేజితుడవుతాడు. దీనికి కారణం సంస్కృత భాషయొక్క శబ్దమాధుర్యము, ఉచ్చారణా ప్రభ...

కుండలినీ యోగ - భౌతిక శాస్త్రం

భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రములో అలౌకికమైన భగవదారాధనతో పాటు ఆధునిక శాస్త్రములోని అంశములవలే కొన్ని పోలికలున్నాయి, అందులో ఒకటి కుండలినీ యోగము.  కుండలినీ యోగ శాస్త్రము ప్రకారము 5 పంచభూతములు 5 కేంద్రాలలో మనిషి వెన్నెముకనంటి ఉంటాయి. అవి వరుసగా పృధ్వి గ్రంధి (మూలాధారములో - మనిషి పీఠములో), జలగ్రంధి (స్వాధిష్టానములో-నాభిక్రింద), అగ్ని గ్రంధి (మణిపురములో - నాభిస్థానములో), వాయు గ్రంధి (అనాహతములో - ఛాతి స్థానములో), ఆకాశగ్రంధి (విశుద్ధ స్థానములో - కంఠ స్థానంలో) ఉంటాయి. అంటే అవి వరుసగా ఆకాశగ్రంధి (విశుద్ధ స్థానములో - కంఠ స్థానంలో)                                                                                  ^ వాయు గ్రంధి (అనాహతములో - ఛాతి స్థానములో)   ।                                       ...