తెలుగు టైపింగులో మెళకువలు



ముందుగా తెలుగు కీబోర్డులో అక్షరాలు ఎలా అమర్చబడ్డాయో చూద్దాం. తెలుగు అక్షరమాల పెద్దది కనుక అచ్చులూ, హల్లులూ, గుణింతాలూ అన్నింటినీ రెండు బోర్డులలో కూర్చారు. మొదటిబోర్డులో అచ్చులూ, కఠిన హల్లులూ ఉన్నాయి. రెండో బోర్డులో గుడింతాలూ, సరళ హల్లులూ ఉన్నాయి. వాటి వివరాలలోకి వెళదాం.

మొదటి బోర్డులో ఎడంవైపు అచ్చులన్నీ ఉంటాయి. కుడివైపు కఠిన హల్లులూ. 

పై చిత్రం చూస్తే ఇలా తెలుస్తుంది. అ,ఇ, ఉ అచ్చుల దీర్ఘాలు సరిగ్గా వాటిపైనే ఉన్నాయి. అలాగే ఎ,ఏ,ఐ,ఒఓ,ఔ లు కూడా. ఇక హల్లులకు వద్దాం, క్రింది చిత్రం చూడండి.
హల్లులలో ఒక అక్షరక్రమం లేకున్నా క,చ,ట,త, ప లు ఒక దగ్గరగా ఉన్నాయి. వాటికి పైగా గ,జ,డ,ద,బ లున్నాయ్. క్రింద య,ర,ల,వ, స లున్నాయ్. ఇవన్నీ సరళంగా పలికే హల్లులు. ఒక్కొక్క సరళహల్లుకూ కఠిన హల్లు అదే స్థానంలో రెండో బోర్డులో ఉన్నాయ్. ఎలాగంటే క-ఖ, చ-ఛ, ట-ఠ,.... వగైరా. క్రింద చిత్రం చూడండి:

రెండో కీ బోర్డులో ఎడం వైపు గుణింతాలుంటాయి - పై చిత్రంలో ర-గుణింతాలున్నాయి ఉదాహరణగా. అవే గుణింతాలు అన్ని హల్లులకు పనికొస్తాయి. 

రెండో కీబోర్డులో కుడివైపు కొన్ని హల్లులుంటాయి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగులో టైప్ చెయ్యటం ఎలా?

కుండలినీ యోగ - భౌతిక శాస్త్రం

అలౌకికం-లౌకికం