అష్టాంగ యోగ విశిష్టత

ఎనిమిది అంగములు కల  యోగమార్గము జీవన్ముక్తికి అతి పటిష్టమైనతార్కిక , శాస్త్రీయమైన మార్గం


పటిష్టమెందుకంటే  యోగములోని అంగములు ఒక పద్ధతిలో సాగుతూతోడ్పడుతూలౌకిక జీవితానికికూడా భద్రతఏర్పరుస్తాయి.


తార్కికమెందుకంటే వివరణ ద్వారానేప్రయోగాలు లేకుండా కూడాఅర్ధం చేసుకోవచ్చును


శాస్త్రీయమేలనంటే ప్రయోగాల ద్వారా ఫలితాలను వివరించ వచ్చునుఫలితాలను లెక్కించవచ్చునుఅందరికి అందించవచ్చును.


ముఖ్యంగా ఆధునిక మానవుడికి  మార్గం మరింత భద్రతను ఇస్తుందిసులువుగా ఉంటుందిఉన్న 8 అంగములుఇవి:

  • యమ
  • నియమ
  • ప్రాణాయామ
  • ఆసన
  • ప్రత్యహార
  • ధారణ
  • ధ్యాన
  • సమాథి


యమనియమాలు పాటించటమంటే పౌరధర్మాలను అనుసరించటమేప్రభుత్వము విధించిన పౌరసూత్రాలు అందరూపాటించాలిలేకుంటే శిక్షకు గురౌతారుయమనియమాలు పౌరసూత్రాలన్నింటికీ కలిపి ఒక భద్రతా వలయంలాగా (ఫైర్వాల్పనిచేసి మనిషి నిశ్చింతగా తన జీవితలక్ష్యాల పై దృష్టిపెట్టివాటికోసము మాత్రమే పని చేసుకోవచ్చును.


ప్రాణాయామఆసనాల ద్వారా మనిషి ఆరోగ్యానికి భద్రత ఏర్పడిఆరోగ్యాన్ని గురించిన చింత ఉండదుజీవనప్రమాణమూ పెరుగుతుంది.


ప్రత్యాహరధారణధ్యానాల ద్వారా మానసిక శాంతి లభించిబుద్ధి కుదిరి లౌకిక విషయాలు సరిగా చక్కపెట్టుకోవచ్చునుచింతలు లేని లౌకిక జీవితం గడుపుతూదైవ మార్గము వైపు మెల్లగా ప్రయాణం చెయ్యవచ్చునుసమాథి మార్గంసుగమమం అవుతుంది.


ఇక సమాధి దశ బహు దీర్ఘమైనదిప్రయోజనకారి దశ యొక్క గమ్యము కైవల్యమే అయినా వృద్ధిని అనుసరించిఆనందముప్రశాంతత పెరుగుతూంటాయి


ఇంత పకడ్బందీగా ఉండే మార్గము మరొకటి లేదు అనిపిస్తుంది

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగులో టైప్ చెయ్యటం ఎలా?

కుండలినీ యోగ - భౌతిక శాస్త్రం

అలౌకికం-లౌకికం