ఏకాదశి

 పాపం-పుణ్యం


పుణ్యమంటే శాస్త్రం ఏమి చెప్పిందిపునాతి ఇతి పుణ్యంఅంటే పవిత్రీకరించునదీపరిశుభ్రత చేసే కార్యము పుణ్యకార్యం


కానీ పాపం అంటే ఇంత స్పష్టమైన నిర్వచనం కనపడలేదుఅందుకని పుణ్యకర్మలు కానివన్నీ పాప కర్మలు అనిపించుతోంది. (ఇది తప్పేమో కూడాఎందుకంటేశూన్యం నుండి ఒక వైపుకు ధనరాశులు (పుణ్యంఅనుకుంటే వ్యతిరేక దిశలో ఋణరాశులు(పాపం). అంటే రెండింటి మధ్య రెండింటిని కలుపుతూసమన్వయపరుస్తూ “సున్న” ఉందిఅలాగే మనిషి కర్మలలో కొన్నిపుణ్యాన్నిస్తేకొన్ని పాపాన్ని ఇస్తాయిమిగిలినవి  ఫలితాన్నీ ఇవ్వకుంటాయిప్రతి పనికి పుణ్యపాప ఫలితాలుంటాయారెండూ కాని ఫలితములూ ఉంటాయేమో)


కర్మ అంటే గీతలో ‘యజ్ఞం’ అని చెప్పబడిందియజ్ఞం అనేది మనిషి భగవంతుని చేర్చే క్రమంక్రియలు అని చెప్పబడిందితద్వతిరిక్తమైన క్రియలన్నీ యజ్ఞమూ, కర్మలూ కావు అని అర్ధం వస్తుంది. యజ్ఞకర్మలు మనిషిని పవిత్రుని (పుణ్యునిచేస్తే మిగిలినవి మనిషిని అదేస్థాయిలో ఉంచటమోపాపుని చేయటము జరుగుతుందిఇక్కడ పాపమంటే అపవిత్రమనే తలంచవలెను.


ఏకాదశి ఉపవాసం వల్లన పుణ్యం లభిస్తుందా


పుణ్యమంటే పవిత్రీకరణమనుకుంటేశరీరముమనస్సు శుద్ధి చెందుతాయికేవలం ఒక్క ఏకాదశి వల్లన కాదుక్రమేపి జరుగుతుంది.


ఏకాదశి నిర్జలాహారం వల్లన మనిషి శరీరంలో జీర్ణక్రియలు (ఆహారమునీరూ స్పీకరించకక్రమంగా తగ్గికొన్ని గంటల తరవాత జీర్ణక్రియ పూర్తిగా ఆగి శరీరంలో అన్ని విభాగాలూ విశ్రాంతి తీసుకుంటాయి. బహుశా 18 గంటల తరవాత - ఉపవాసం ముందు స్వీకరించిన ఆహారం 3 గంటలు కడుపులో, 6 గంటలు చిన్న ప్రేవులలో, 9 గంటలు పెద్ద ప్రేవులలో జీర్ణించ పడుతూంటాయిఅంటే 3 గంటల తరవాత కడుపు, 9 గంటల తరవాత చిన్న ప్రేవులు, 18 గంటల తరవాత పెద్ద ప్రేవులు,  పై అన్నివిభాగాలూ విశ్రాంతి తీసుకుంటున్నామరమ్మత్తు శాఖలు పని చేస్తాయి - అవే జీవకణాలుకొన్ని భాగాలుఇవి దినమంతా కూడా పనిచేస్తూంటాయి - అనేక లక్షల రసాయన చర్యలు చేస్తూశరీరంలో వేడిని కాపాడుతూపోషకాలను స్వీకరిస్తూవ్యర్ధాలను బయటకు పంపుతూండే ప్రతి జీవకణానికి ఈనాడు పోషకాలను తీసుకునే పని ఉండదు (18 గంటల తరవాత పోషకాలేమి రావు కనుక), కేవలం  వ్యర్ధాలను బయటకు పంపే పనే కనుక మరింత  పనే, శ్రద్ధగా చేస్తాయి


(భారం తగ్గింది కనుక వేగంనాణ్యతా పెరిగి ఎప్పటినుంచో మిగిలిన వ్యర్ధాలను బయటకు పంపే అవకాశమూ దొరుకుతుందిరోజూ బయటకు పంపే వ్యర్ధాల కన్నా తక్కువ మొత్తమే అయినారోజుల తరబడి లోపల ఉండిపోయిన విషవ్యర్ధాలను (విషమంటే హానికరమైనవనిబయటకు పంపుతాయి.


(జీవకణాల లాగునే మూత్రాశయానికి కూడా 18 గంటల తరవాతఎప్పటి వలే కాక చాలా భారం తగ్గుతుందివ్సర్ధాలుతగ్గుతాయిఅయితే పైన “లో చెప్పినట్లు పాత చెత్తనంతా బయటకు పంపే అవకాశం దొరుకుతుంది


 విధంగా ప్రతి అవయవం లోని జీవకణాలు (ఇక్కడ కణాలంటే అనేక రకాల కణాలూ - చర్మ కణాలూరక్త కణాలూలింఫుకణాలూ - రోగ నిరోధక శక్తికి - మరమ్మత్తు పై పని చేశే అవకాశంతగినంత సమయమూ దొరుకుతాయి


శరీరంలోని వ్యర్ధాలు తొలిగి పోతూ అంత:శరీరం శుభ్రమవుతుందిజీర్ణక్రియ ఒత్తిడి తగ్గి క్రియపై ధ్యాస పెట్టవలసిన మెదడు భాగం కూడా విశ్రాంతి తీసుకుంటుందిఅనుబంధ శాఖలకు విశ్రాంతి దొరుకుతుంది


శరీరానికీమనస్సుకు మరింత నాణ్యమైన నిద్రావిశ్రాంతీ లభిస్తాయిఇది ఉపవాసం చేశే అందరూ గమనించగలరని అనుకుంటానుఇది చాలా ముఖ్యమైన అంశం


ఉపవాసానికి ముందురాత్రి కూడా ఉపవాసము ఉండాలి. (చాగంటి గారు ఏకాదశి పై ఇచ్చిన ప్రవచనంలో విని, ఆచరించి గమనించాను. ముందు రోజు నుండి మొదలు పెట్టాం కనుక, ఏకాదశి నాటికి శారీరకంగా, మానసికంగా సిద్ధమవుతాం) ఏకాదశి నాడు ఎటూ ఉపవాసమేద్వాదశి నాడు ఉదయం 7-8 గంటలకు స్వల్పాహారంతో ఉపవాసం ముగుస్తుంది.


అంటే దశమి వాడు సాయంత్రం 5 గంటల నుంచిద్వాదశి వాడు 7గంటల వరకు అనుకుంటే మొత్తం (7+24+7) 36-38 గంటల నిర్జల ఉపవాసంఅందులో 18 గంటలు తీశివేస్తేజీర్ణక్రియకు/మరమ్మత్తుకు 18-20 గంటల విశ్రాంతి/పని చేశే అవకాశమూ దొరుకుతాయి ప్రతి రెండు వారాలకూఇంత అవకాశము మన శరీరానికి మనమెప్పుడన్నా ఇచ్చామా


శనివారం ఉపవాసాలు కొంత వరకూ  దిశలో ఉపయోగమున్నారాత్రి అన్నం తక్క ఏదో ఒకటి తింటూనే ఉంటారు చాలామందిరాత్రి ఏమీ తినకుండా ఉంటే (‘ఏకభుక్తం’ అంటారు - సహజంగా పగలు మాత్రమేకొంచెం ప్రయోజనంకానీ ఏకాదశి నాడు లభించినంత అవకాశం శనివార ఉపవాసాలకు లభించదు.

 

ఇంక - ఇలాగు ఏకాదశినాడే చెయ్యాలా? అంటే,  అవసరం లేదు విధంగా ప్రతి రెండవ ఆదివారమో (శలవు కనుకచేశినా ఇదేఫలితంశరీరమానసిక ఆరోగ్యాలు మరింత మెరుగు పడతాయిమనిషి ఎక్కువ కాలం జీవించ గలడు.


శరీరమూమనస్సూ శుద్ధి చెందటమే పవిత్రంఅంటే పుణ్యం ఇక్కడ జాతి వాడైనా  ప్రక్రియ ద్వారా ఇలాంటి పుణ్యాన్ని సంపాదించుకోగలడు. ఈ ప్రక్రియ ద్వారా ఇది అందరికీ సాధ్యం


జీవించి ఏమి సాధించాలిఅది వ్యక్తిగత అభిప్రాయం


అయితే ఇలాంటి ఉపవాస ప్రక్రియకు మన శాస్త్రం భగవద్ధ్యానాన్ని కూడా జత పరచి మానసిక ధ్యానంవిశ్రాంతులను మరిన్ని రెట్లు పెంచాయిదీర్ఘాయుష్షూఆనందమూ లభిస్తాయిసనాతన ధర్మం మనిషి జీవితానికి లక్ష్యం “భగవత్సిద్ధి” అని నిర్ణయించిందిదానికి అనేక సంవత్సరాల సాధన కావాలిసాధన ఫలించాలంటే మనిషికి దీర్ఘాయుష్షుఆరోగ్యమూ అవసరంభగవద్సిద్ధిని మించి మనిషికి మోక్షాభిలాష - మోక్షం అన్న కోరికకలగాలిఅంతకు మించి “జీవన్ముక్తికై” అభిలాష కలగాలిజన్మలెన్ని జన్మపునర్జన్మ వగైరాలన్నీ మనకూ  జీవితంలో సమాధానం దొరకని అంశాలుమన పూర్వజన్మ (అంటూ ఒకటి ఉంటే అదేమిటో ) తెలియదుతదుపరి జన్మ ఉంటుందా (రేపనేది ఉంటుందని మనకి తెలుసుకొన్ని రోజులూసంవత్సరాలూబ్రతికాం కనుకతెలియదుజన్మంటూ ఒకటి ఉందని మాత్రం తెలుసుపుట్టామూ-జీవిస్తున్నాం కనుక జీవితంలోసాధించేయాలిసాధనకు ప్రయత్నించాలిబ్రతికి ఉన్నంత వరకూ


మోక్షమూజీవన్ముక్తీ లభిస్తాయాలభిస్తాయనే మన శాస్త్రాలు చెపుతున్నాయిమోక్షమంటే ముక్తి అని నిర్వచనందేని నుంచి తాపత్రయాలనుంచిమోక్షమంటే విష్ణులోకం వగైరాలు (అని కొందరి అభిప్రాయంశరీరం నుండి దివ్యకాంతి బయటకు వచ్చిఅలా….పైకి పోవటమని …కొందరి ఊహాకాక  జీవితంలోనే కష్టాలను అధిగమించిఎప్పుడూ (సదాఆనందంగా (సుఖంగాఅని కాదుఉండగలగటం - అని కూడా చాలా మంది విజ్ఞులు చెపుతారుసాధన చేస్తూంటే  ఛాయలు మన జీవితంలో గోచరిస్తాయిఅదే మనకు నిదర్శనం ముందుకు సాగిపోవటానికి.


దానికి భక్తి గొప్ప మార్గం. జ్ఞాన మార్గం కన్నా భక్తి (మూఢ భక్తికాదుమార్గం సులభంఎప్పుడైతే మూఢ భక్తి కాదు అన్నామో, భక్తికీ, మూఢభక్తికీ తేడా తెలిపేందుకూ జ్ఞానమూ అవసరమని తెలుస్తుందికొంచెం జ్ఞానముమరింత (భక్తిసాధనా …ఇలా అంచెలంచెలుగా సాగాలి.


మొత్తానికి ఉపవాసాలు సాధనకు పునాదులు వేస్తాయి- ఎవరికైనా, ఏ స్థాయిలో ఉన్నా.




కామెంట్‌లు

  1. ఉపవాసం చేస్తే తలనొప్పి, నీరసం..వీటికి భయపడి మానేశా...బహుశా శరీరానికి ఉపవాసం నెమ్మది.నెమ్మదిగా అలవాటుచేయాలేమో

    రిప్లయితొలగించండి
  2. అవును!! ఉపవాసం చేస్తే ఆరోజు మధ్యాహ్నానికి తలనొప్పి, కాళ్ళు నొప్పులు మొదలవుతున్నాయి!! భగన్నామ స్మరణ అటుంచితే, ఎప్పుడెప్పుడు తిందామా అనే ఆలోచన!! ఉపవాసం ఎలా మొదలు పెట్టాలో, ఎలా కొనసాగించాలి అని కూడా చెప్పు బాబాయ్

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగులో టైప్ చెయ్యటం ఎలా?

కుండలినీ యోగ - భౌతిక శాస్త్రం

అలౌకికం-లౌకికం